ఎలుక పైన ఊరేగి ఎల్ల లోకములు తిరిగి Song

 

ఎలుక పైన ఊరేగి ఎల్ల లోకములు తిరిగి
ఏలుచుందు వెల్లరను గణపతి
ఎటు పొగడుదు నీ మహిమలను
ఎలుక పైన ఊరేగి ఎల్ల లోకములు తిరిగి
ఏలుచుందు వెల్లరను గణపతి
ఎటు పొగడుదు నీ మహిమలను

చరణం 1||
మోద కముల నైవేద్యం
భుజియింపుచు కడుపారా
మోదమొందు విగ్నేశ్వరా
భక్తుల మ్రొక్కుల గొనుమో దొరా
మోదకముల నైవేద్యం
భుజియింపుచు కడుపారా
మోదమొందు విఘ్నేశ్వరా
భక్తుల మ్రొక్కుల గొనుమో దొరా
ఎలుక పైన ఊరేగి ఎల్ల లోకములు తిరిగి
ఏలుచుందు వెల్లరనూ గణపతి
ఎటు పొగడుదు నీ మహిమలను

చరణం 2||
ఎన్నెన్నో అడ్డంకులు ఈ బ్రతుకు పొడుగునా
అన్ని అడ్లు తీరునట్లు వరమీయగ దిరానా
వేడెదమో గజవదనా గతి వేరెవరిక నినువినా
ఎలుక పైన ఊరేగి ఎల్ల లోకములు తిరిగి
ఏలుచుందు వెల్లరనూ గణపతి
ఎటు పొగడుదు నీ మహిమలను

చరణం 3||
లోకములో మొదటి పూజ నీకే గద విఘ్నరాజ
నీ ఘనతకు వే..రే..ల నిదర్శనం
మాకు నీవొసగుము నీ.. దర్శనం
లోకములో మొదటి పూజ నీకే గద విఘ్నరాజ
నీ ఘనతకు వే..రే..ల నిదర్శనం
మాకు నీ వొసగుము నీ.. దర్శనం
ఎలుక పైన ఊరేగి ఎల్ల లోకములు తిరిగి
ఏలుచుందు వెల్లరనూ గణపతి
ఎటు పొగడుదు నీ మహిమలను
ఎటు పొగడుదు నీ మహిమలను
దేవా ఎటు పొగడుదు నీ మహిమలను

No comments:

Post a Comment